రోడ్డుప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు | Two injure in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు

Aug 3 2015 7:45 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కనుగొట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు.

వెల్దుర్తి : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కనుగొట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై సాయంత్రం సమయంలో ఒకే బైక్‌పై ఇద్దరు వీఆర్వోలు తిరుగు ప్రయాణమయ్యారు.

కాగా మార్గ మధ్యంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో గోవర్ధనగిరి వీఆర్వో కృష్ణమూర్తి, సుదేపల్లి వీఆర్వో హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement