38 మంది ఎర్రచందనం కూలీల పరారీ | Two held for red sanders smuggling red sanders | Sakshi
Sakshi News home page

38 మంది ఎర్రచందనం కూలీల పరారీ

Oct 9 2014 10:10 PM | Updated on Sep 2 2017 2:35 PM

మరోసారి ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి జిల్లాలో కలకలం సృష్టించింది.

చిత్తూరు:మరోసారి ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి జిల్లాలో కలకలం సృష్టించింది. గురువారం పలమనేరులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం కూలీలు వ్యవహారం వెలుగుచూసింది. వీరంతా ఒక లారీలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకునే క్రమంలో వారు విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేసి పరారయ్యారు.

 

అనంతరం చిత్తూరు సమీపంలోని లారీని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా ఇద్దరు కూలీలు మాత్రమే చిక్కారు. మిగతా 38 మంది లారీని వదిలేసి పారిపోయారు. ప్రస్తుతం ఆ లారీని సీజ్ చేసిన పోలీసులు ఆ కూలీలను విచారించే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement