విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం | Two girl students go missing from Visakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం

Nov 26 2013 10:32 PM | Updated on Sep 2 2017 1:00 AM

జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్లిన వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధినుల ఆచూకి కోసం బంధువులను, స్నేహితులను  ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆరా తీశారు.

 

అయినా వారి ఆచూకి లభించకపోవడంతో చివరికి వారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement