వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి | two died in volvo bus accident | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి

Jun 3 2015 6:47 AM | Updated on Aug 25 2018 6:06 PM

వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కివాయి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ప్రకాశం: వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కివాయి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

విశాఖపట్నం నుంచి చైన్నై వెళ్తున్న వోల్వో బస్సు సింగరాయకొండ సమీపంలోకి చేరుకోగానే డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు మృతిచెందారు.. ఇందులో నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు, ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement