కారు బోల్తా.. ఇద్దరు మృతి | two died in road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఇద్దరు మృతి

Apr 4 2015 7:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

అనంతపురం టౌన్: ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన అనంతపురం నగర శివారులోని  రుద్రంపేట బైపాస్ రోడ్డుపై 'సాక్షి' ఆఫీస్ ఎదురుగా జరిగింది. పెనుగొండలోని బాబా దర్గాను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ అజీమ్(35) అక్కడిక్కడే మృతిచెందగా.. బాబావలీ (38) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారందరూ తాడిపత్రికి చెందినవారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement