breaking news
babavali
-
కన్నీటి సేద్యం
నల్లమాడ: ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నీరు కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరా పంటకు ట్యాంకర్ నీరు అవసరం. ట్యాంకు నీరు రూ.600 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులకు ఓసారైనా పంటలను తడపాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఐదారు ఎకరాలు పంట సాగు చేసిన రైతులు నీటి కొనుగోలుకు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, నాయకులు స్పందించి వేరుశనగ, కంది పంటలకు రక్షక తడులు అందించాలని రైతులు కోరుతున్నారు. అయితే వర్షాభావంతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రక్షక తడుల ద్వారా పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కారు బోల్తా.. ఇద్దరు మృతి
అనంతపురం టౌన్: ఇండికా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన అనంతపురం నగర శివారులోని రుద్రంపేట బైపాస్ రోడ్డుపై 'సాక్షి' ఆఫీస్ ఎదురుగా జరిగింది. పెనుగొండలోని బాబా దర్గాను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ అజీమ్(35) అక్కడిక్కడే మృతిచెందగా.. బాబావలీ (38) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారందరూ తాడిపత్రికి చెందినవారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.