
'వనరుల లేమి సమస్యను అధిగమిస్తాం'
2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు స్పష్టం చేశారు.
విజయవాడ : 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదన్నారు. రెండు రోజుల పాటుజరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైంది. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ప్రకృతి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలన్నారు. వనరుల లేమి సమస్యను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్లపై సీఎస్ టక్కర్ ఫైర్ :
జిల్లాల్లో పరిశ్రమలకు భూకేటాయింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పీ టక్కర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పరిశ్రవమల ఏర్పాటు కోసం కొంతమంతి గత 18 నెలల నుంచి వేచి చూస్తున్నారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన వారికి 100 రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు టక్కర్ ఆదేశాలు జారీ చేశారు.