SP Tucker
-
డిసెంబర్లో డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ గురువారం జీవో జారీ చేశారు. -
'వనరుల లేమి సమస్యను అధిగమిస్తాం'
విజయవాడ : 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదన్నారు. రెండు రోజుల పాటుజరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైంది. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ప్రకృతి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలన్నారు. వనరుల లేమి సమస్యను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లపై సీఎస్ టక్కర్ ఫైర్ : జిల్లాల్లో పరిశ్రమలకు భూకేటాయింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పీ టక్కర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పరిశ్రవమల ఏర్పాటు కోసం కొంతమంతి గత 18 నెలల నుంచి వేచి చూస్తున్నారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన వారికి 100 రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు టక్కర్ ఆదేశాలు జారీ చేశారు. -
‘రెవెన్యూ శాఖలో నో గ్రేడింగ్’
తెనాలి(గుంటూరు): రెవెన్యూ శాఖలో గ్రేడింగ్ విధానం అమలు చేయటం లేదని, ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చందర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలోని ఆర్ అండ్ బీ బంగళాలో అసోసియేషన్ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామానికొక వీఆర్వోను కనీసం నియమించాలని, కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ శాఖలో 110 హెచ్ఓడీలున్నాయనీ, వాటికి కార్యాలయాలు చూపిస్తే, రాజధానికి వచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
మూడు రోజుల ఫోన్ బిల్లు రూ.2,15,000