రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టురట్టు | Two culprits arrested in railway tickets scam in visakhapatnam | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టురట్టు

Feb 1 2015 1:59 PM | Updated on Aug 25 2018 6:06 PM

రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టును ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం విశాఖపట్నంలో రట్టు చేశారు.

విశాఖపట్నం: రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టును ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం విశాఖపట్నంలో రట్టు చేశారు. నగరంలోని బీచ్ రోడ్డులో అనధికారికంగా టికెట్లు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఆర్పీఎఫ్ పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిందితుడు శివబాలనాగేశ్వర్తోపాటు బీముడు అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేల టికెట్లు, రూ. 50 వేల నగదుతోపాటు కంప్యూటర్, స్కానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి.. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement