టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య | TV artist kalyan chakravarthy suicide due to financial problems | Sakshi
Sakshi News home page

టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య

May 20 2014 10:13 AM | Updated on Nov 6 2018 7:53 PM

బుల్లితెర ఆర్టిస్ట్ కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు.

భీమవరం : బుల్లితెర ఆర్టిస్ట్ కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారు. తన స్వస్థలం అయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కల్యాణ చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. తహసిల్దార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన కల్యాణ్ చక్రవర్తి తల్లి రెండేళ్ల క్రితమే మరణించారు.

వీళ్లకు ఉన్న ఇల్లు కూడా కొన్నాళ్ల క్రితం అమ్మేసినట్లు తెలిసింది. ఈయనకు ఇంకా పెళ్లి కాలేదు. టీవీ సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా కల్యాణ్ చక్రవర్తి నటించినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement