టీటీడీ యాప్‌ ప్రారంభం

టీటీడీ యాప్‌ ప్రారంభం - Sakshi


ఇకపై మొబైల్‌ఫోన్‌ నుంచే టీటీడీ సేవలు: ఈవో సాంబశివరావు



సాక్షి, తిరుమల: మొబైల్‌ ఫోన్‌ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ–హుండీ, ఈ–డొనేషన్‌ సౌకర్యాలు పొందేలా టీటీడీ మొబైల్‌యాప్‌ రూపొందించింది. ఉగాది సందర్భంగా తిరు మల ఆలయం వద్ద బుధవారం ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌’ పేరుతో కొత్త యాప్‌ను టీటీడీ ఈవో డాక్టర్‌ దొండ పాటి సాంబశివరావు ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌తో ఇప్పటివరకు 1.30 కోట్ల మంది శ్రీవారి దర్శనం చేసుకు న్నట్లు వివరించారు. ఐటీ సంస్థ టీసీఎస్‌ సహకారంతో మొబైల్‌ యాప్‌ రూపొందించి నట్లు తెలిపారు.



ఇకపై భక్తులు శరవేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా యాప్‌ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతానికి ఈ–హుండీ, ఈ–డొనేషన్, రూ.300 దర్శన టికెట్ల బుకింగ్, గదుల బుకింగ్‌ సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గూగుల్‌ స్టోర్, టీటీడీ వెబ్‌సైట్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌కున్న 33 లక్షల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.



టీటీడీ ఆన్‌లైన్‌ సేవలు భేష్‌: సుధానారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ వ్యవ స్థాపకులు సుధానారాయణమూర్తి టీటీడీ ఐటీ సేవల్ని అభినందించారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా టీటీడీ శ్రీవారి భక్తులకు మరింత చేరువైందన్నారు. భక్తులు కూడా సులభతరంగా టీటీడీ సేవలు పొందవచ్చన్నారు. టీటీడీ యాప్‌ను ఈ ఆంగ్ల అక్షరాలతో "GOVINDA TIR UMALA TIRUPATI DEVASTHANAMS"డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

 తిరుమల శ్రీవారి ఆలయం లో బుధవారం ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వర కు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహిం చారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, మరోపీఠంపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ ఈవో సాంబ శివరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు. శాస్త్రోక్తంగా ఆస్థాన కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. ఆలయ మహ ద్వారం నుంచి గర్భాలయం వరకు 60వేల కట్‌ పుష్పాలు, 8 టన్నుల సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్ప కలశం, నవధాన్యాలతో  శ్రీవేంకటేశ్వరుడు, ఆలయం వెలుపల పుష్పగజేంద్రుడు, పండ్ల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top