సుప్రీంకోర్టుకు చేరిన టీటీడీ వివాదం | TTD  chief priest venugopala deekshitilu file petition in supreme | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు చేరిన టీటీడీ వివాదం

Jun 13 2018 1:58 PM | Updated on Sep 2 2018 5:20 PM

TTD  chief priest venugopala deekshitilu file petition in supreme - Sakshi

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రమణ దీక్షితులు కంటే ముందే టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో బుధవారం వేణుగోపాల దీక్షితులు న్యాయవాది కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ బోర్డు వేణుగోపాల్ దీక్షితులును ప్రధాన అర్చకులగా నియమిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే తమకు ముందస్తు సమాచారమివ్వకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కేవియట్ దాఖలు చేసిన్టటు న్యాయవాది తెలిపారు.

టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నరని ఆయన అన్నారు. తిరుమల దేవస్థానంపై వస్తున్న ఆరోపణలను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనను అక్రమంగా టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, వచ్చే నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానని రమణదీక్షితులు చెప్పిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement