ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
	హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసింది. సీఎం కిరణ్పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరింది.
	
	రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని విమర్శించారు. సీఎం, మంత్రులు ఒకరికొకరుగా చీలిపోయారని ఆరోపించారు. మాజీ డీజీపీనే సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
