గుప్తనిధుల కోసం తవ్వకాలు | Treasure excavations in Mantralayam | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Sep 5 2015 3:50 PM | Updated on Sep 3 2017 8:48 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.

మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని తోట హనుమప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు విగ్రహాలను చిందరవందరగా పడేసి తవ్వకాలు చేశారు. తవ్వకాలు జరపడానికి ముందు పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement