ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి | Tractor roll: two killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి

Jan 7 2014 2:38 AM | Updated on Aug 25 2018 6:06 PM

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణంపాలైన సంఘటన ముల్కలపల్లి మండలంలోని రామచంద్రాపురం(గొల్లగూడెం) గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

ములకలపల్లి, న్యూస్‌లైన్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణంపాలైన సంఘటన ముల్కలపల్లి మండలంలోని రామచంద్రాపురం(గొల్లగూడెం) గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నరసింహాపురానికి చెందిన దానే సూరయ్య అనే రైతుకు చెందిన ధాన్యాన్ని అదే గ్రామానికి చెందిన బన్నే రాంబాబు ట్రాక్టర్‌లో రామచంద్రాపురానికి రవాణా చేశారు. ధాన్యం లోడుతో పాటు మామిళ్లగూడెం, నరసింహాపురం గ్రామాలకు చెందిన ఏడుగురు కూలీలు కూడా వెళ్లారు. అక్కడ ధాన్యం దింపేసి తిరిగి వారు ట్రాక్టర్‌పై స్వగ్రామాలకు వస్తుండగా రామచంద్రాపురం - చాపరాలపల్లి ఎస్సీ కాలనీల మధ్య మూలమలుపులో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న ధాన్యం యజమాని సూరయ్య కుమార్తె, నర్సింహాపురానికి చెందిన ఆళ్లూరి శ్యామల(40), ట్రాక్టర్ నడుపుతున్న మామిళ్లగూడేనికి చెందిన ఊకే ప్రసాద్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 సహాయంతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement