టమాట వ్యాపారుల నిరసన | Tomato merchants complaint gives to market chairman | Sakshi
Sakshi News home page

టమాట వ్యాపారుల నిరసన

Oct 31 2013 4:22 AM | Updated on Sep 2 2017 12:08 AM

లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు బుధవారం నిరసనకు దిగారు.

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు బుధవారం నిరసనకు దిగారు. మార్కెట్‌లో లెసైన్‌‌స కలిగిన టమాట వ్యాపారులను విద్యుత్ మీటర్లు, బిల్లుల పేరుతో అధికారులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌లో 20 ఏళ్లుగా టమాట వ్యాపారం చేసుకుంటున్న తమ లావాదేవీలు జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి హంగామా చేస్తున్నారని వాపోయారు. 30 ఏళ్లుగా టమాట వ్యాపారం చేసుకుంటున్న జీఎస్‌ఆర్ మున్నాభాయ్(షాపు నం.30) షాపునకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అక్రమ కనెక్షన్లను ప్రోత్సహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని టమాట వ్యాపారులు ఆరోపించారు.
 
 అక్రమంగా వ్యాపా రం చేస్తున్న వారి వద్ద డబ్బులు తీసుకుంటూ లెసైన్‌‌స కలిగిన వ్యాపారులకు మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ సూపర్‌వైజర్ సాంబరెడ్డి, వాచ్‌మన్ రమేష్‌పై మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్‌కు రాత పూర్వకం గా ఫిర్యాదు చేయనున్నామని పేర్కొన్నారు. నిరసన తెలిపిన వారిలో పసుల మధుబాబు, చిరంజీవి, రాజు, గులాం అ హ్మద్, నారాయణ, మనోజ్, ఖన్నా తదితరులు ఉన్నారు.
 
  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు
 కూరగాయల మార్కెట్ సూపర్‌వైజర్ సాంబరెడ్డి టమాట వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మా ర్కెట్ బయట కరెంట్ అక్రమ కనె క్షన్లను ప్రోత్సహిస్తూ డబ్బుల వసూలు చేస్తున్నారు. లెసైన్‌‌స వ్యాపారులకు నష్టం జరుగుతోంది.
  - పసుల మధుబాబు, టమాట వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement