నేటి ముఖ్యవార్తలు
నేటి ముఖ్యవార్తలు
Mar 17 2017 9:27 AM | Updated on Sep 5 2017 6:21 AM
ఎమ్మెల్సీ ఎన్నికలు
నేడు ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్ధానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరుల్లో గల ఎమ్మెల్సీ స్ధానాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
పరీక్షా సమయం
నేటి నుంచి తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 6.28 లక్షల మంది, తెలంగాణలో 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
గ్రూప్-2
ఇవాళ గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు ఫైనల్ కీని విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ.
సబ్‌కమిటీ సమావేశం
నేడు టీఎస్ కేబినేట్ సబ్‌కమిటీ సమావేశం కానుంది. ఎత్తిపోతల పథకాలపై కమిటీ చర్చించనుంది.
బీజేఎల్పీ సమావేశం
నేడు ఉత్తరాఖండ్ బీజేఎల్పీ భేటీ కానుంది. కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక.
బీజేఎల్పీ సమావేశం
రేపు ఉత్తరప్రదేశ్ బీజేఎల్పీ సమావేశం కానుంది. సీఎం అభ్యర్ధి ఎంపికపై చర్చ చేయనున్నట్లు సమాచారం. పదవికి రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, యోగి ఆదిత్యనాథ్, మహేశ్ శర్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Advertisement
Advertisement