నేడు బొత్స జన్మదిన వేడుకలు | Today Bothsa Birthday Celebrations | Sakshi
Sakshi News home page

నేడు బొత్స జన్మదిన వేడుకలు

Jul 9 2018 11:55 AM | Updated on Jul 9 2018 11:55 AM

Today Bothsa Birthday Celebrations - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్టు  పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయ్‌కుమార్‌ తెలిపారు.

స్థానిక సత్య కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బొత్స సత్యనారాయణ జన్మదినాన్ని పురష్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

ఉదయం 8 గంటలకు స్థానిక సత్య కార్యాలయంలో మెగా రక్తదానం శిబిరం, 9 గంటలకు పట్టణంలోని గంజిపేట, కణపాక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ, 9.30 గంటలకు కలెక్టర్‌ ఆఫీసు జంక్షన్‌లో పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

10 గంటలకు గాజులరేగ మెయిన్‌రోడ్‌లో పేదలకు గొడుగులు పంపిణీ, 10.30 గంటలకు డక్కినవీధిలో పేదలకు గొడుగులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  12 గంటలకు మయూరి జంక్షన్‌ వద్ద పేదలకు చీరలు పంపిణీ, 12.30 గంటలకు ఆబాద్‌వీదిలో మదర్సా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ, పూల్‌బాగ్‌కాలనీలోని ద్వారకామయి అంధుల పాఠశాల, ప్రేమ సమాజంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. పార్టీ నాయకులు రొంగలి పోతన్న, ముల్లు త్రినాధ్, చందక రమణ, కంది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement