సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పకడ్బం దీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పకడ్బం దీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ముందస్తు ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇదివరకే ఓటరు జాబితాలను సిద ్ధం చేసిన యంత్రాంగం ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు, వసతుల పరిశీలన, రూట్ మ్యాప్‌ల రూపకల్పన పనులు చేపడుతోంది.
బూత్ నంబర్లను కేటాయించిన అధికారులు కేంద్రాల వద్ద వాటిని వేయిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. అధికారులు జిల్లావ్యాప్తంగా పోలింగ్‌కు సం బంధించిన పనులు చేపడతున్నారు. ఇందులో భా గంగా బూత్‌లు, రూట్ మ్యాప్‌ల తయారీ, వసతులపై దృష్టిపెట్టారు. కామారెడ్డి డివిజన్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గతం లో కామారెడ్డి నియోజక వర్గంలో 219 బూత్‌లు ఉం డగా ఇపుడు 223కు చేరాయి.
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 227 ఉండగా, ఇప్పుడు 229కి చేరాయి. ఆయా బూత్‌లకు సంబంధించిన పూర్తి సమాచారా న్ని సేకరించిన అధికారులు వసతులను కూడా పరి శీలించారు.ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఆయా మండలాల్లో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇలా జిల్లాలోని మిగతా డివిజన్‌లలోనూ పోలింగ్ పనులు కొనసాగుతున్నాయి.
సమస్యలు లేకుండా
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతులు ఉన్నాయా.. లేవా అని అధికారులు పరిశీలిస్తున్నారు. వెబ్ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత చాలా వరకు రెవెన్యూ యంత్రాంగంపైనే ఉండడంతో ఆ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పకడ్బందీగా నిర్వహణ
నోటిఫికేషన్ రాకముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవ డం ద్వారా ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూ సుకోవచ్చన్న భావనతో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే పోలీసు యం త్రాంగం కూడా సంసిద్ధమైంది. జిల్లాలోని సమస్యాత్మక బూత్‌లను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్య లు చేపట్టాలో ముందే అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేం దుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.