ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి | To prepare the land for projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి

Oct 3 2014 12:48 AM | Updated on Sep 2 2017 2:17 PM

ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి

ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి

జిల్లాలో కొత్త ప్రాజెక్టుల కోసం భూములు సిద్ధం చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు.

  •  కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ఆదేశం..అధికారులతో సమీక్ష
  • విశాఖ రూరల్: జిల్లాలో కొత్త ప్రాజెక్టుల కోసం భూములు సిద్ధం చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రాజెక్టులపై ఆయనతోపాటు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 80 శాతం వాటా రాష్ట్రానికి దక్కనుందని తెలిపారు.
     
    దీంతో పాటు స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రాజెక్టులకు భూముల గుర్తింపు వేగవంతంగా జరగాలని, నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement