breaking news
Asokgajapati raju
-
నేడే పైడితల్లి సిరిమానోత్సవం
-
పైడితల్లమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పైడితల్లి ఉత్సవంలో ఆలయ అనువంశక ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడితల్లమ్మ సిరిమానోత్సవం అత్యంత వైభవంగా రేపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా జనం భారీగా తరలి వస్తారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ** -
ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి
కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ఆదేశం..అధికారులతో సమీక్ష విశాఖ రూరల్: జిల్లాలో కొత్త ప్రాజెక్టుల కోసం భూములు సిద్ధం చేయాలని, ఆర్అండ్ఆర్ ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రాజెక్టులపై ఆయనతోపాటు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 80 శాతం వాటా రాష్ట్రానికి దక్కనుందని తెలిపారు. దీంతో పాటు స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రాజెక్టులకు భూముల గుర్తింపు వేగవంతంగా జరగాలని, నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.