అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ధర్నాకు దిగింది.
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ధర్నాకు దిగింది. ఆదివారం సెలవు దినం అయినా కూడా తరగతులు నిర్వహిస్తున్నందుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు.
సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఒత్తిళ్లకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.