ఎమ్మెల్యే సుగుణమ్మకి స్థానికుల ఝలక్ | Tirumala locals protests infront of MLA Sugunamma | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సుగుణమ్మకి స్థానికుల ఝలక్

Feb 1 2019 6:44 PM | Updated on Feb 1 2019 6:47 PM

Tirumala locals protests infront of MLA Sugunamma - Sakshi

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ(ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరుమల : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకి తిరుమల స్థానికులు ఝలక్ ఇచ్చారు. తిరుమల స్థానికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత మూడురోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్షను విరమించడానికి
అక్కడికి వచ్చిన సుగుణమ్మను స్థానికులు నిలదీశారు. దీంతో తిరుమల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని సుగుణమ్మ చెప్పారు. టీటీడీ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారం
చేస్తామని సుగుణమ్మ హామీ ఇచ్చారు.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామని స్థానికులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీలేక సుగుణమ్మ, జిల్లా ఇన్ చార్జ్ పులవర్తి నానిలు దీక్ష స్థలం నుండి వెళ్లిపోయారు. తిరుమల స్థానికుల దీక్ష రేపటి నుండి మరింత ఉధృతం చేయనున్నట్టు తెలుస్తోంది. రేపు తిరుమలలో దుకాణాలు మూసే ఆలోచనలో తిరుమల వాసులు ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement