23న కైశిక ద్వాదశి మహోత్సవం | tirumala information | Sakshi
Sakshi News home page

23న కైశిక ద్వాదశి మహోత్సవం

Nov 20 2015 1:59 AM | Updated on Sep 3 2017 12:43 PM

తిరుమలలో ఈ నెల 23వ తేదీన కైశిక ద్వాదశి మహోత్సవం నిర్వహించనున్నారు

సాక్షి,తిరుమల: తిరుమలలో ఈ నెల 23వ తేదీన కైశిక ద్వాదశి మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆస్థానం నిర్విహ స్తారు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కొలిపే పర్వదినంగా వ్యవహరిస్తారు. సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు. అదే రోజు ఆలయ వెనుక భాగంలోని చక్రతీర్థంలో ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా అర్చకులు, పరిచారకులు వెళ్లి అక్కడ వెలసిన సుదర్శన చక్రతాళ్వారు, ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement