గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం | Thugs Destroyed Lord Siva Temple For Hidden funds | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం

Mar 10 2018 11:53 AM | Updated on Mar 10 2018 11:53 AM

Thugs Destroyed Lord Siva Temple For Hidden funds - Sakshi

గర్భ్బగుడిలో శివలింగాన్ని తొలగించి తవ్వకాలు చేసిన దృశ్యం , శివాలయం

కర్నూలు, బూడిదపాడు(గూడూరు): మండలం పరిధిలోని పాత బూడిదపాడులో ఉన్న పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గురువారం రాత్రి దుండగలు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. కొంతమంది దుండగులు పాత బూడిదపాడులోని శివాలయం గర్భగుడి తలుపులు తొలగించి లోపల శివలింగాన్ని, పాశాన్ని గడ్డపారలతో పెకిలించారు. అనంతరం తవ్వకాలకు వీలుపడకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం పూజారి తిమ్మరాజు ఆలయానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌ఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి నిధులు చోరీకి గురికాలేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement