‘అనకాపల్లిలో మూడు పారిశ్రామిక పార్కులు’ | three industrial parks in anakapalli | Sakshi
Sakshi News home page

‘అనకాపల్లిలో మూడు పారిశ్రామిక పార్కులు’

Jun 24 2015 6:18 PM | Updated on May 28 2018 4:20 PM

విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తలపెట్టిన పారిశ్రామిక పార్కుల కోసం ఆ సంస్థ ఈడీ రఘునాథ్ బుధవారం స్థల పరిశీలన చేశారు.

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి మండల పరిధిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తలపెట్టిన పారిశ్రామిక పార్కుల కోసం ఆ సంస్థ ఈడీ రఘునాథ్ బుధవారం స్థల పరిశీలన చేశారు. మండల పరిధిలోని వల్లూరు, మారేడుపూడి, కొంచంగి, కుండ్రం, వేట జంగంపాలెం, సంపత్‌పురం, కోడూరు గ్రామాల పరిధిలో సుమారు 2,500 ఎకరాలను సేకరించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు, లాజిస్టిక్స్ పార్కు, ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి సేకరించాల్సిన భూములను ఈడీ రఘునాథ్, స్థానిక ఆర్డీవో పద్మావతి, ఎమ్మెల్యే పీల గోవింద్‌తో కలసి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement