రెండు ఆలయాలలో చోరీ | theft in two temples at ananthpuram distirict | Sakshi
Sakshi News home page

రెండు ఆలయాలలో చోరీ

Feb 23 2015 8:57 AM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం, పెనకచర్ల గ్రామంలో రెండు ఆలయాల్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

అనంతపురం : అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం, పెనకచర్ల గ్రామంలో రెండు ఆలయాల్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని చిదంబరస్వామి, పెద్దమ్మ ఆలయాల్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. చిదంబర స్వామి ఆలయంలో లక్షన్నర రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటిలో బంగారు గొలుసు, మీసాలు, వెండి కవచాలు ఉన్నాయి.

పెద్దమ్మ గుడిలో వెండి కవచాలు చోరీకి గురైనట్లు సోమవారం ఉదయం గుర్తించారు. అయితే, రెండు ఆలయాల్లోనూ తలుపులు కానీ, తాళాలు కానీ బద్ధలు కొట్టకుండానే దొంగలు లోపలికి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ చోరీలపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(గార్లదిన్నె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement