క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం | The scheme is a boon for farmers in the mammary marina | Sakshi
Sakshi News home page

క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం

Jan 22 2015 2:28 AM | Updated on Sep 2 2017 8:02 PM

క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం

క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం లాంటిదని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు పేర్కొన్నారు.

జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు
 
పులివెందుల రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం లాంటిదని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని పశువైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 4150 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే ప్రభుత్వం పశువులకు ప్రత్యేక హాస్టల్స్ నిర్మించనుందన్నారు.

పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం దాణాను తప్పనిసరిగా వాడాలన్నారు. బోరుబావులలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు రాయితీతో మంచి పోషక విలువలు ఉన్న గడ్డి విత్తనాలు ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
గొర్రెల పెంపకం ఏడీ మాల కొండయ్య మాట్లాడుతూ బేడ్ పాలక్ బీమా యోజన పథకం గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఏడీ హేమంత్‌కుమార్, పులివెందుల డివిజన్ ఏడీ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని పశు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement