పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీలు | The new committees are meant to strengthen the party | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీలు

Nov 21 2014 3:19 AM | Updated on May 29 2018 3:42 PM

పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీలు - Sakshi

పార్టీ బలోపేతం కోసమే నూతన కమిటీలు

జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని,

సోమందేపల్లి: జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు  నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు  ప్రతి ఒక్కరూ  సహకరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ కోరారు. గురువారం మండల కేంద్రములోని గుడిపల్లి సర్పంచ్ వెంకటరత్నం కాంప్లెక్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.

పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు గతంలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధ్యాన్యం ఉంటుందన్నారు. అందరి సహాయ సహకారాలతోనే నూతన కమిటీని ఎన్నుకొంటామన్నారు. ఎంపికైన సభ్యులు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.  రుణమాఫీ, పింఛన్లపై పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు.  

కార్యక్రమంలో సమన్వయ కర్త సానిపల్లి మంగమ్మ, మహిధర్,   పార్టీ  మండల కన్వీనర్ నాయకుడు నారాయణస్వామి, సర్పంచ్‌లు వెంకటరత్నం, నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ కొల్లప్ప, నాయకులు అశ్వర్థమ్మ, సత్యనారాయణరెడ్డి, గజేంద్ర, నరేంద్రరెడ్డి, కంబాలప్ప, రామాంజినేయులు, నాగమణి, శ్రీరాములు, శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, ముత్యాలు, హరీష్, నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, కిష్టప్ప, సంజీవరాయుడు, సజ్జప్ప, ఆంజనేయులు, దామోదర్, ఆదినారాయణరెడ్డి, నాగరాజు, నజీర్, అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement