లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి | The incident took place on Saturday when Lorry's death occurred. | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి

Aug 20 2017 4:44 AM | Updated on Sep 17 2017 5:42 PM

లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి

లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి

లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

మందస : లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన కె.జగన్నాథపురం గ్రామానికి చెందిన కార్జి లింగరాజు(35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పనికి బయలుదేరిన లింగరాజు బిన్నళమదనాపురం సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆయిల్‌ కొట్టడానికి ద్విచక్ర వాహనం తిప్పుతుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగరాజు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లింగరాజు మరణవార్త అందడంతో భార్య పార్వతి, కుమార్తె శిరీషా, కుమారుడు మనోజ్‌లు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సోంపేట ఎస్‌ఐ భాస్కరరావు(మందస ఇన్‌చార్జి) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement