కంటైనర్‌ను ఢీకొన్న బైక్‌: బీటెక్‌ విద్యార్థి మృతి | Road Accident In PSR Nellore | Sakshi
Sakshi News home page

కంటైనర్‌ను ఢీకొన్న బైక్‌: బీటెక్‌ విద్యార్థి మృతి

Jul 20 2018 9:24 AM | Updated on Oct 20 2018 6:23 PM

Road Accident In PSR Nellore - Sakshi

 మృతి చెందిన సమీర్

కోట (నెల్లూరు జిల్లా): ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని అదుపు తప్పి బైక్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటన  విద్యానగర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని ఉప్పలమర్తికి చెందిన చందు, సూళ్లూరుపేటకు చెందిన సమీర్‌ ఎన్‌బీకేఆర్‌లో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నారు. ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడి బైక్‌ తీసుకుని కోటకు వెళ్లి తిరిగి విద్యానగర్‌ కళాశాల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న రొయ్యల కంటైనర్‌ లారీని ఢీకొన్నారు.

ప్రమాదంలో బైక్‌ కంటైనర్‌ కిందకు దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారకస్థితిలోకి చేరుకున్న క్షతగాత్రులను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమీర్‌కు తలకు తీవ్రగాయం కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సమీర్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎన్‌బీకేఆర్‌ అధ్యాపకులు, విద్యార్థులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.    సమీర్‌ తండ్రి ఎస్దాని షార్‌ కేంద్రంలో పని చేస్తున్నాడు. కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement