breaking news
Registered case
-
చంద్రబాబు కక్ష సాధింపు.. వైఎస్ జగన్ పై కేసు నమోదు
-
షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సే న్పై అత్యాచార ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఒక మహిళ హుస్సేన్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం వారిలో ఎంత అయిష్ట త ఉందో బహిర్గతమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ వ్యాఖ్యానించారు. గతంలో ట్రయల్ కోర్టు ఎఫ్ఐఆర్ ఆదేశాలు జారీ చేయ మంటూ తీర్పునివ్వడం సరైన చర్యేనని పేర్కొ న్నారు. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ షానవాజ్ హుస్సేన్ సుప్రీంకోర్టుకెక్కారు. సుప్రీంలోనూ ఆయనకు చుక్కెదురైంది. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. సోదాలు నిర్వహిస్తుండగా రాధాకృష్ణ హల్చల్ సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకుని హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ఆయన తన అనుచరులతో బయట సీఐడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఐడీ సోదాల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడం ఆపాలని, బయట అనుచరులను అదుపు చేయాలని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. దాంతో సీఐడీ అధికారులు తీవ్ర ఒత్తిడి మధ్యే పంచనామా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ పంచనామాలోని అంశాలను త్వరగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు వెంటనే విజయవాడకు తిరిగి వచ్చేశారు. అనంతరం వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించిన విషయంపై విజయవాడలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' -
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
మందస : లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన కె.జగన్నాథపురం గ్రామానికి చెందిన కార్జి లింగరాజు(35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పనికి బయలుదేరిన లింగరాజు బిన్నళమదనాపురం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ఆయిల్ కొట్టడానికి ద్విచక్ర వాహనం తిప్పుతుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగరాజు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లింగరాజు మరణవార్త అందడంతో భార్య పార్వతి, కుమార్తె శిరీషా, కుమారుడు మనోజ్‌లు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సోంపేట ఎస్ఐ భాస్కరరావు(మందస ఇన్చార్జి) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లాలూపై ఈడీ కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ, అతని కుటుంబ సభ్యుల మీద ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ చలామణి కేసును నమోదు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ రైల్వే హోటళ్ల కేటాయింపుల్లో అవకతవకల కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కేసులో వారిని నిందితులుగా చేర్చింది. జూలై 5న లాలూ, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి ఇళ్లలపై పలు సోదాలు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల మెయింటెనెన్స్‌ను లంచం తీసుకుని ఒక కంపెనీకి అప్పగించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ నమోదుచేసింది. -
‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దానంపై కేసుల్లో పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. దానంపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతీ లేదని, ఈ కేసులో దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


