వీరఘట్టం:ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని యోచిస్తోంది.
వీరఘట్టం:ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇంతవరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల విద్యార్ధులకు మాత్రమే యూనిఫాం సరఫరా చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యార్థులు మాత్రం సాధారణ దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు.
వారికీ ప్రభుత్వం యూనిఫాం సరఫరా చేస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు హైదరాబాద్ నుంచి ఆదేశాలందాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంఈఓలకు సమాచారం అందించారు. జిల్లాలో 25 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక హైస్కూల్, ఆరు ప్రాధమికోన్నత, 18 ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1500 మంది విద్యార్థులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. వీరందరికీ మరో నెల రోజుల్లో యూనిఫాం అందనుంది.