నేడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాక | The arrival of the head of the Andhra Telangana today | Sakshi
Sakshi News home page

నేడు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాక

Nov 18 2013 3:41 AM | Updated on Aug 15 2018 9:17 PM

టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం వరంగల్‌కు రానున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన , వినయభాస్కర్ లక్ష్మీకాంతరావు

వరంగల్‌సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం వరంగల్‌కు రానున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఇద్దరు కుమారుల వివాహాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లాకు రానున్నట్లు పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వినయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి హన్మకొండకు 11గంటలకు చేరుకుంటారన్నారు.

అనంతరం హన్మకొండలోని పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని, త ర్వాత వివాహ వేదిక కాజీపేట ఫాతీమానగర్ చర్చికి వెళ్తారని ఆయన చెప్పారు. కాగా, వివాహానంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement