breaking news
Laxmi kantam
-
నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక
వరంగల్‌సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం వరంగల్‌కు రానున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఇద్దరు కుమారుల వివాహాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లాకు రానున్నట్లు పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వినయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి హన్మకొండకు 11గంటలకు చేరుకుంటారన్నారు. అనంతరం హన్మకొండలోని పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని, త ర్వాత వివాహ వేదిక కాజీపేట ఫాతీమానగర్ చర్చికి వెళ్తారని ఆయన చెప్పారు. కాగా, వివాహానంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కోడి రెట్టతో బయోగ్యాస్ తయార్ !
పౌల్ట్రీ వ్యర్థాలతో బయోగ్యాస్ తయార్ సాక్షి, హైదరాబాద్: కాసేపు కోళ్ల ఫారాల వద్దకెళితే చాలు... ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం స్వాగతం పలుకుతుంది. కోళ్ల రెట్టతో చెడు వాసనొక్కటే సమస్యకాదు... వ్యర్థాలను నిర్మూలించకుంటే నీటి కాలుష్యం తోపాటు అనేక ఇతర సమస్యలూ ముసురుకుంటాయి. మరి ఈ చిక్కులకు పరిష్కారం? ఆ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడమే అంటోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ). ఇందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి ఆహూజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఓ నమూనా ప్లాంట్‌ను కూడా సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ నమూనా ప్లాంట్‌ను పౌల్ట్రీ రైతులు, టెక్నాలజిస్టులు, బ్యాంకు అధికారుల కోసం గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ దేశంలో పౌల్ట్రీ రంగం ఏటా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యర్థాల సమర్థ నిర్వహణ కీలకమవుతోందని చెప్పారు. ఈ అవసరాన్ని గుర్తించి ఐఐసీటీ ఈ సరికొత్త బయోగ్యాస్ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని తెలిపారు. పౌల్ట్రీ వ్యర్థాలకు నీరుతోపాటు ఒక రకమైన బ్యాక్టీరియాను జోడించి, ఆక్సిజన్ లేని వాతావరణం లో కుళ్లబెడితే మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుందని లక్ష్మీకాంతం వివరించారు. పౌల్ట్రీ వ్యర్థాల నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి చేయగలగడం తమ ప్రత్యేకతని ఆహుజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రతినిధి శ్రుతి అహుజా చెప్పారు. గ్యాస్‌ను కోళ్లఫారాల్లో వినియోగించుకోవచ్చు. మిగిలిన వ్యర్థాన్ని ఆరబెట్టి ఎరువుగానూ, ద్రవరూపంలోనైతే చేపలకు ఆహారంగానూ వాడవచ్చు. ఒకటిన్నర టన్నుల పౌల్ట్రీ వ్యర్థంతో దాదాపు వంద ఘనపుమీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఇది 42 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో సమానమని శ్రుతి వివరించా రు. కార్యక్రమంలో ఐఐసీటీ బయోఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ విభాగం సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎ.గంగాగ్నిరావు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఎ.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.