మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయం: టీజీ వెంకటేష్‌

TG Venkatesh Support To Three Capital Cities Establish In AP - Sakshi

సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ప్రశంసించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలో ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరఫున పోరాటం చేశామని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలను ఖండించారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని టీజీ వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తెరమీదకు తీసుకువచ్చి అక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశామని ప్రస్తావించారు. విశాఖలో పరిపాలన రాజధానితోపాటు రాయలసీమ ప్రాంతంలో ప్రాంతీయ పరిపాలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమలో ఉత్తరాంధ్ర ప్రాంతాంల్లో మినీ అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక హైకోర్టుతో సరిపెట్టకుండా మినీ అసెంబ్లీ మినీ సెక్రటేరియట్‌ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

చదవండి : 3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
మూడు రాజధానులపై సర్వత్రా హర్షం

ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top