ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు | tenth class exams | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు

Mar 28 2014 4:30 AM | Updated on Oct 20 2018 6:17 PM

జిల్లాలో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా మొదలయ్యాయి.

ఎండవేడిమితో విద్యార్థుల ఇబ్బందులు


 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా మొదలయ్యాయి. జిల్లా వ్యాపితంగా 172 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తాము ఉత్తమ మార్కులు సాధించాలని కోరుకుంటూ విద్యార్ధులు పలు దేవాలయాల్లో పూజలు చేసి పరీక్షలకు రాయడానికి బయలు దేరారు.  తెలుగు, సంస్కృతానికి సంబంధించి మొదటిరోజు 33,814 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 223 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రామలింగం జిల్లాలో 8 కేంద్రాలను తనిఖీ చేశారు. నెల్లూరులోని ఎస్‌ఆర్‌కే పాఠశాలలో తనిఖీలు చేసిన డీఈఓ  ఇన్విజిలేటర్లకు తగు సూచనలిచ్చారు.

 

పరిశీలకులు మరో 8 , స్క్వాడ్ బృందాలు 89 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఎండ తీవ్రత (40 డి గ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు, వారికి సహాయకులుగా వచ్చిన త ల్లిదండ్రులు ఇబ్బందిపడ్డారు. పలువురు తల్లిదండ్రులు చెట్లకింద, గోడల మాటున  నిలబడి పిల్లలు పరీక్షలు రాసి వచ్చేంతవరకు ఎదురు చూశారు. విద్యార్థులు పరీక్షలు రాసి కేంద్రాల నుంచి వెలుపలికి రాగానే పలువురు తల్లిదండ్రులు వారికి తాగునీరు, జ్యూస్‌ను అందించారు.


 అప్పుడే మొదలైన ప్రైవేటు ప్రచారం
 ఒక వైపు పదోతరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులకు  కేంద్రాల వాకిట వద్ద నిలబడి పలువురు ప్రైవేటు కళశాలల వారు తమ పాఠశాలలో చేరాలంటూ కరపత్రాలు పంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement