టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన | telugu youth Concern | Sakshi
Sakshi News home page

టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన

Mar 16 2014 3:42 AM | Updated on Aug 10 2018 8:01 PM

టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన - Sakshi

టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన

ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు మాత్రమే తాము పనికి వస్తామా అంటూ నగర తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొరిటెపాడు, న్యూస్‌లైన్:  ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు మాత్రమే తాము పనికి వస్తామా అంటూ నగర తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలంయంలో శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గం సర్వసభ్య సమావేశం తెలుగు యువత అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది.

 

తూర్పు నియోజకవర్గ సమావేశం జరుగుతుంటే నగర తెలుగు యువత అధ్యక్షుడు సౌపాటి రత్నానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవటం ఏమిటని రత్నం అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వారిని బయటకు నెట్టివేశారు.
 సమావేశంలోనూ అసమ్మతి నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించి, వర్గపోరు బయట పడకుండా నాయకులు జాగ్రత్తపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement