'తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోంది' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోంది'

Published Tue, Jul 8 2014 8:54 PM

'తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోంది'

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ ఎత్తును 15 సెంమీ పెంచుతుంటే వారికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని దేవినేని ఆరోపించారు. 
 
ఆర్డీఎస్ ఎత్తు పెంపు విషయంలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు హోదాను మరచి బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే కడప,కర్నూలు జిల్లాల భూములు ఎడారులుగా మారుతాయని దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు 7 టీఎమ్‌సీల నీరు వచ్చిందని, రావాల్సిన మిగిలిన నీటి విడుదల కోసం లేఖ రాశామని దేవినేని ఉమ తెలిపారు. 

Advertisement
Advertisement