వసతి గృహంలోని బాలికకు పాముకాటు | Teenage girl bitten by a SNAKE in boarding school | Sakshi
Sakshi News home page

వసతి గృహంలోని బాలికకు పాముకాటు

Jun 28 2015 2:15 PM | Updated on Apr 8 2019 6:21 PM

నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని బాలికల వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న సుమతి(15) అనే విద్యార్థి పాము కాటుకు గురైంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని బాలికల వసతి గృహంలో పదోతరగతి చదువుతున్న సుమతి(15) అనే విద్యార్థి పాము కాటుకు గురైంది. వివరాలు.. ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున బాలిక కాలుకు పురుగు కుట్టిందేమో అని భావించి, పట్టించుకోలేదు. కానీ ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను వసతిగృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిశీలించిన ఆస్పత్రి వర్గాలు బాలికను పాము కరించిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement