టీడీపీ సభ్యుల మధ్య సమన్వయ లోపం

TDP Protest In Legislative Council On Governor Speech - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం బయటపడింది. బడ్జెట్‌పై గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నల్లచొక్కాలు ధరించిన టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వాకౌట్ చేశారు. మరో​వైపు మండలిలో మాత్రం గవర్నర్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా మండలిలో నిరసన తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు మండలిలో ఎందుకు చేయలేదంటూ బీజేపీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆరా తీస్తున్నారు. (విశాఖనే పరిపాలన రాజధాని)

అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపి బయటకు వచ్చేయాలని, కౌన్సిల్‌లో మాత్రం రెండురోజులు చర్చలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సభ్యలు భిన్నవాదనలు వినిపించినట్లు సమాచారం. దీనిపై బీజేపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. వాకౌట్ విషయంలో టీడీపీలో సమన్వయ లోపం కన్పించిందన్నారు. వాకౌట్ విషయమై టీడీపీ ముందుగా చర్చించుకోలేదేమోనని అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ వ్యతిరేకించినట్టా..? స్వాగతించినట్టా అని సభ్యులు చర్చించుకుంటున్నారు. (అసెంబ్లీలో నిరసన.. కౌన్సిల్‌లో ఘర్షణ!)

మరోవైపు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును శాసనమండలిలో అడ్డుకోవాలని ప్రతిపక్షం భావిస్తోంది. దీనిలో భాగంగానే మండలిలో మెజార్టీ ఉన్నందున సభ్యులంతా పాల్గొనాలని చంద్రబాబు వారికి దిశానిర్ధేశం చేశారు. మూడు రాజధానుల సహా ముఖ్యమైన బిల్లులు మళ్లీ కౌన్సిల్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందని, వస్తే వాటిని అడ్డుకోవాలని సభ్యులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లుపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని హితబోధ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top