పోలీసుల అదుపులో జేసీ అనుచరుడు | TDP MP JC Close Aide Suresh Reddy In Police Custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఎంపీ జేసీ అనుచరుడు

Mar 5 2018 10:02 AM | Updated on Aug 9 2018 8:43 PM

TDP MP JC Close Aide Suresh Reddy In Police Custody   - Sakshi

సర్కిల్‌ లో జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొండసాని సురేశ్ రెడ్డి

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కొండసాని సురేశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కొండసాని సురేష్రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పీఏగా పనిచేశారు. ఇప్పుడు అనధికారికంగా జేసీకి సేవలు కొనసాగిస్తున్నారు.  ప్రస్తుతం ఓ పేరు మోసిన క్రికెట్ బుకీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కొండసాని సురేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసేందుకు తర్జనభర్జన పడుతున్నారు.

కాగా పంచాయతీ రాజ్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తూ ఇటీవల సురేష్ రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి పేరుతో భూబ్జాలు,  అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సురేశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు జేసీ ద్వారా సురేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు.  ఈ నేపథ్యంలో పుట్టపర్తి టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు ఓ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement