మూడు రాజధానులపై టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం | TDP Leaders Trying To Prevent Students New Capital Support | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులపై టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం

Jan 20 2020 6:03 PM | Updated on Jan 20 2020 6:55 PM

TDP Leaders Trying To Prevent Students New Capital Support - Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు సోమవారం సంబరాలు చేసుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. జై జగన్‌ అంటూ.. భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఓర్వలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి సీఎం జగన్‌కు మద్దతుగా జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం  చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతల తీరును తప్పుపట్టిన విద్యార్థి సంఘాలు.. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందని మండిపడ్డాయి. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని విద్యార్థి నాయుకులు డిమాండ్‌ చేశారు.
చదవండి: చంద్రబాబు సంఘవిద్రోహ శక్తా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement