చింతమనేని వర్సెస్ ముళ్లపూడి | TDP Leaders Internal fight In West Godavari district | Sakshi
Sakshi News home page

చింతమనేని వర్సెస్ ముళ్లపూడి

Jul 15 2018 7:39 AM | Updated on Aug 10 2018 9:52 PM

TDP Leaders Internal fight In West Godavari district - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో కుంపట్లు పెరిగిపోతున్నాయి. ఆధి పత్య పోరుతో నాయకులు రోడ్డెక్కడం పరిపాటిగా మారిపోయింది. మద్యం షాపుల గొడవతో ఎడమొహం పెడమొహంగా మారిన ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు మధ్య తాజాగా ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబునాయుడి వ ద్దకు చేరింది. వీరి గొడవకు పంచాయతీరాజ్‌ డీఈ ఒకరు సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పెదవేగి మండలం ముండూరులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిగాయి.

 ఈ గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అ ధ్యక్షుడు, గ్రామ సర్పంచ్‌ తండ్రికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌తో బంధుత్వం ఉంది. మరోవైపు ప్రొటోకాల్‌ కూడా ఉండటం తో ఆ శిలాఫలకాలపై జెడ్పీ చైర్మన్‌ పేరు వేయించారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే, విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్‌ పేరు వేస్తే తాను రానని చెప్పడంతో అతని పేరు ఉన్న చోట పెయింటింగ్‌ వేశారు. అదేచోట స్థానిక ఎంపీటీసీ పేరు వేయాలని చింతమనేని అడగ్గా ముండూరు నాయకులు ససేమి రా అన్నారు. చింతమనేని రానని చెప్పడంతో గ్రామ సర్పంచ్‌ పేరుతో శిలాఫ లకం తయారు చేసి వారే ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ విషయం జెడ్పీ చైర్మన్‌ దృష్టికి వెళ్లింది. 

కలెక్టర్‌కు ఫిర్యాదు
ప్రొటోకాల్‌ ప్రకారం తన పేరు వేయకుండా ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అన్ని ప్రారంభోత్సవాల వివరాలు, ఫొటోలు కావాలని అడిగారు. ఫొటోలు తెప్పించుకుని తనపేరు ఎక్కడా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. విషయాన్ని కలెక్టర్‌ భాస్కర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి తన పేరు వేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పినట్టు సమాచారం. అధికారులపై చర్య తీసుకుంటారు గాని, విప్‌పై చర్యలు ఏ ముంటాయని ప్రశ్నించిన బాపిరాజు అసలు మీరు ఇచ్చిన చనువు వల్లే ఇలా జరుగుతుందని కలెక్టర్‌పై నిష్టూరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం
విషయం తెలిసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు జెడ్పీ చైర్మన్‌కు ఫోన్‌ చేసి తనను కలవాలని, కూర్చొని వివా దం పరిష్కరించుకుందామని చెప్పారు. అందుకు సుముఖంగా లేని జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు శుక్రవారం రాత్రి అమరావతిలో సీఎం చంద్రబాబు, లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన ఆధీనంలో ఉన్న విభాగాల్లో పనిచేస్తూ ప్రొటోకాల్‌ ప్రకారం తన పేరు వేయకపోయినా తన దృష్టికి తీసుకురాకపోవడంతో ఏలూరు పంచాయతీరాజ్‌ డీఈపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెలవుపై వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement