చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి | TDP Leaders Attacked On Dalits In Chandragiri | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి

May 16 2019 10:21 PM | Updated on May 16 2019 11:55 PM

TDP Leaders Attacked On Dalits In Chandragiri - Sakshi

సాక్షి, చిత్తూరు : చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అడ్డగింతతో వేరే మార్గంలో ఎన్‌ఆర్‌ కమ్మరపల్లికి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దళితులపై టీడీపీ చేసిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ దళితులను పరామర్శించడానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీ చార్జ్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వీడియో కోసం క్లిక్‌ చేయండి :
దళితులపై టీడీపీ నేతల దాడులు

Advertisement
 
Advertisement
Advertisement