
ఆళ్లగడ్డ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ ఆయనకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.