ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాల దౌర్జన్యం

TDP Goons Tried To Attack On Anil Kumar In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని తోటవల్లూరు కరకట్ట వద్ద టీడీపీ గూండాలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. పామర్రు ఎమ్మెల్యే  కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. విజయవాడ వెళ్తున్న కైలే అనిల్‌కుమార్‌ కారును అడ్డుకొని టీడీపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారు. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి స్థాని​కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కైలే అనిల్‌ కుమార్‌ స్పందిస్తూ.. తనపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. మాపై దాడులుకు పాల్పడుతుంది రైతులు కాదు.. టీడీపీ గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

(ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top