కిడ్నాప్ సూత్రధారి శర్మ అరెస్టు | suspended constable held in balanagar | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ సూత్రధారి శర్మ అరెస్టు

Aug 29 2013 6:26 PM | Updated on Sep 4 2018 5:07 PM

ముగ్గురు అధికారులను కిడ్నాప్ చేశానంటూ బుధవారం సంచలన ప్రకటన చేసిన మాజీ కానిస్టేబుల్ గిరి ప్రసాద్ శర్మ ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్:ముగ్గురు అధికారులను కిడ్నాప్ చేశానంటూ బుధవారం సంచలన ప్రకటన చేసిన మాజీ కానిస్టేబుల్ గిరి ప్రసాద్ శర్మ ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పీటీవో ఎస్సీని కిడ్నాప్ చేసి కలకలం సృష్టించిన  కిడ్నాప్ సూత్రధారి శర్మ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతన్ని బాలానగర్ లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  శర్మ ఒక్కరిని మాత్రమే కిడ్నాప్ చేశాడని, పబ్లిసిటీ కోసమే ముగ్గురిని కిడ్నాప్ చేసానంటూ అతను ప్రకటించాడని తెలిపారు.

 

 మాజీ కానిస్టేబుల్ శర్మ ముగ్గురు అధికారులను కిడ్నాప్ చేసినట్లు బుదవారం ప్రకటించడంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.  పీటీవో అధికారులు అవినీతికి పాల్పడుతున్నందుకే కిడ్నాప్ చేసానని బుధవారం ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ముగ్గురు అధికారులను కిడ్నాప్ చేశానని అతను ప్రకటించడంతో పోలీస్ అధికారులు షాకయ్యారు. శర్మ కిడ్నాప్ చేసిన వారిలో ఇద్దరు పీటీవో అధికారులు, ఒక బీజేపీ ప్రతినిధి ఉన్నారని తెలిపాడు.  అధికారులను కిడ్నాప్ చేయడంతో పోలీస్ శాఖ ప్రక్షాళన అవుతుందని శర్మ పేర్కొన్నాడు.




 
 

Advertisement
 
Advertisement
Advertisement