నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి | Suicide of including the mother and four children | Sakshi
Sakshi News home page

నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

Mar 9 2016 10:12 AM | Updated on Nov 6 2018 7:56 PM

నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి.

నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం గ్రామంలోని హిదాయత్‌నగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రహ్మాన్, జరీన(30) దంపతులకు నలుగురు పిల్లలు. బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురైన జరీన నలుగురు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తల్లితో పాటు కూతుర్లు ఆయెషా(13), అంజుమ్(6) మృతిచెందగా.. మహ్మద్(10), నాగుర్(8) తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు చిన్నారులను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement