'నాకు చదువు వద్దు..ఏమోద్దు' | student missing in nuziveedu IIIT | Sakshi
Sakshi News home page

'నాకు చదువు వద్దు..ఏమోద్దు'

Mar 13 2015 10:36 AM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యావిధానం సరిగాలేదని లేఖ రాసి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

విజయవాడ : విద్యావిధానం సరిగాలేదని లేఖ రాసి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురువారం కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. వివరాలు..కలిదండి మండలం మూలలంక గ్రామానికి చెందిన పువ్వాడ కిరణ్‌ కుమార్ నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఏ సమస్య వచ్చిన ముందుండే కిరణ్ గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు.  దీంతో స్నేహితులు కాలేజీ యాజమాన్యానికి  తెలిపారు.

సాయంత్రం వరకు రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు బంధువులను ఆరా తీసిన పలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌లో తనిఖీ చేయగా కిరణ్ రాసిన లేఖ బయటపడింది. 'నాకు చదువు వద్దు ఏమోద్దు నేను వెళ్లి పోతున్నాను' అని కిరణ్ ఆ లేఖలో రాశాడు.  దాంతో పోలీసులు కేసు నమోదు చేసి... కిరణ్ అచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement